గవర్నర్‌ను కలిసిన నిమ్మగడ్డ రమేష్‌ కుమార్

తిరిగి తనను ఎస్‌ఈసీగా నియమించాలని కోరిన నిమ్మగడ్డ

Nimmagadda-governor-BiswaBhusan

అమరావతి: ఏపి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సోమవారం ఉదయం భేటీ అయ్యారు. తనను ఎస్‌ఈసీగా పునర్నియామకం చేయాలంటూ గవర్నర్‌కు నిమ్మగడ్డ విజ్ఞాపన పత్రం అందజేశారు. హైకోర్టు తీర్పు, తదితర అంశాలపై గవర్నర్‌తో ఆయన అరగంట పాటు మాట్లాడి వెళ్లారు. ఆయనను తిరిగి ఎస్‌ఈసీగా నియమించడంపై గవర్నర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా తనను ఎస్ఈసీగా నియమించకపోవడంపై రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పుపై స్టేకు సుప్రీం కోర్టు నిరాకరించినా నిమ్మగడ్డను ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా రమేష్ కుమార్‌కు న్యాయస్థానం కీలక సూచనలు చేసింది. గవర్నర్‌ను కలవాలని నిమ్మగడ్డను ఆదేశించింది. వినతిపత్రం ఇవ్వాలని సూచించింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/