బిజెపిలో చేరనున్న మర్రి శశిధర్ రెడ్డి?

బిజెపి నేతలతో కలిసి ఢిల్లీకి వెళ్లిన శశిధర్ రెడ్డి

marri-shashidhar-reddy-to-likely-to-join-bjp

హైదరాబాద్‌ః తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బిజెపి దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇతర పార్టీలకు చెందిన కీలకమైన నేతలను చేర్చుకుంటూ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై గురి పెట్టింది. డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మరో సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా బిజెపిలో చేరబోతున్నారని తెలుస్తోంది. ఢిల్లీలో ఈ సాయంత్రం ఆయన బిజెపిలో చేరే అవకాశం ఉందని చెపుతున్నారు.

బిజెపి నేతలతో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఆయనతో పాటు డీకే అరుణ కూడా ఉన్నారు. కొన్ని రోజుల నుంచి ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవలి కాలంలో శశిధర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సైతం ఆయన పార్టీ మారబోతున్నారనే దిశగా సంకేతాలను ఇస్తున్నట్టుగా ఉన్నాయి. రేవంత్ రెడ్డిపై ఇటీవల శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో కల్లోలానికి రేవంత్ కారణమని, కాంగ్రెస్ కు నష్టం కలిగించేలా ఆయన చేస్తున్న పనులు ఉన్నాయని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ మాణికం ఠాగూర్ రేవంత్ కు ఏజెంట్ మాదిరి పని చేస్తున్నారని విమర్శించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/