మేజర్ చిత్రం ఫై పవన్ కళ్యాణ్ ప్రశంసలు

మేజర్ చిత్రం ఫై సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసల జల్లు కురిపించారు. మొదటి నుండి విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న నటుడు అడివి శేష్..తాజాగా మేజర్ మూవీ తో జూన్ 03 న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. శేష్ ఈ మూవీ లో హీరోగా నటించడమే కాకుండా కథ – స్క్రీన్ ప్లే కూడా సమకూర్చారు.

శశి కిరణ్ తిక్క ఈ ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహించగా, GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు అడివి శేషు యాక్టింగ్ ఫై , శశి డైరెక్షన్లపై ప్రశంసలు కురిపిస్తూ వస్తున్నారు. అలాగే సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ కురిపిస్తుండగా..తాజాగా పవన్ కళ్యాణ్ ఈ మూవీ ఫై ప్రశంసలు కురిపిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు.

`ముంబై మహానగరంలో 26 నవంబర్ 2008న ఉగ్రవాదులు చేసిన ఘాతుకాలను 26/11 మారణ హోమంగా ఈ దేశం గుర్తుపెట్టుకొంది. నాడు చేసిన కమెండో ఆపరేషన్ లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సాహసాలు.. ఆయన వీర మరణాన్ని వెండి తెరపైమేజర్ ` గా ఆవిష్కరించిన చిత్ర బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను.

ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన తెలుసుకొని ఎంతో సంతోషించాను. అన్ని భాషల వారినీ మెప్పిస్తున్న ఈ బయోపిక్ మన తెలుగు చిత్రసీమ నుంచి రావడం ఆనందం కలిగించింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లాంటి సైనికాధికారులు.. సిబ్బంది దేశ భద్రత కోసం ఎంతగా పోరాడుతున్నారో అందరికీ తెలియాలి. పార్టీ సంబంధిత వ్యవహారాల్లో తలమునకలై ఉండటంతో మేజర్ ఇంకా చూడలేదు. ఆ చిత్రానికి వస్తున్న స్పందన తెలుసుకొన్నాను. త్వరలోనే ఆ చిత్రం వీక్షిస్తాను. ఈ చిత్ర కథానాయకుడు సోదరుడు అడివి శేష్ గారికి హృదయపూర్వక అభినందనలు. ప్రఖ్యాత రచయిత దివంగత శ్రీ అడివి బాపిరాజు గారి మనవడైన శ్రీ శేష్ సినిమాలో భిన్న శాఖలపై అభినవేశం ఉన్న సృజనశీలి. తెలుగు సాహిత్యంపై మక్కువ… వర్తమాన అంశాలపై ఉన్న అవగాహన ఆయన మాటల్లో తెలుస్తుంది.

ఇటువంటివారు మరింత మంది చిత్రసీమకు రావాలి. ఒక సాహసి కథను చలన చిత్రంగా మలచిన చిత్ర దర్శకుడు శ్రీ శశికిరణ్ కు శుభాకాంక్షలు. ఇటువంటి మంచి చిత్రాలు ఆయన నుంచి మరిన్ని రావాలని ఆకాంక్షిస్తున్నానుఅని లేఖలో పేర్కొన్నారు.మేజర్` చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయిన ప్రముఖ హీరో శ్రీ మహేశ్ బాబు గారికి.. చిత్ర నిర్మాతలు శ్రీ శరత్ చంద్రశ్రీ అనురాగ్ రెడ్డిలకు నా అభినందనలు. ఈ చిత్రంలో నటించిన శ్రీ ప్రకాష్ రాజ్.. శ్రీమతి రేవతి.. సాయి మంజ్రేకర్.. శోభిత ధూళిపాళ.. మురళీ శర్మలకు.. చిత్ర సాంకేతిక నిపుణులకు ప్రత్యేక అభినందనలు తెలియజేసారు పవన్ కళ్యాణ్. పవన్ ప్రెస్ నోట్ తో సినిమా కు మరింత బజ్ వస్తుంది.