దేశంలోనే తొలిసారిగా బిడ్డకు జన్మనివ్వబోతున్న ట్రాన్స్‌జెండర్‌ జంట

దేశంలోనే తొలిసారిగా బిడ్డకు జన్మనివ్వబోతున్నారు ట్రాన్స్‌జెండర్‌ జంట. కేరళకు చెందిన ఓ ట్రాన్స్ జండర్ జంట తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ సోషల్ మీడియాలో ద్వారా తెలిపారు. దేశంలో ఓ ట్రాన్స్ జండర్ పురుషుడు గర్భం దాల్చడం ఇదే తొలిసారని వారు పేర్కొన్నారు. ‘తల్లి కావాలనుకునే నా కల, తండ్రి కావాలనుకునే తన (జహాద్) కోరిక త్వరలోనే తీరనునున్నాయి.’ అని అమ్మాయిలా మారిన జియా పావెల్‌ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. కాలం తమను ఒక చోటికి చేర్చి మూడేళ్లయిందని… 8నెలల జీవన్ మరో రూపం అతని కడుపులో ఉన్నాడని ఆమె తెలిపింది.

జియా, జహాద్‌లు గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. వైద్యప్రక్రియల ద్వారా జియా మహిళగా మారారు. ఇక ఆమె సహచరుడు జహాద్ పిల్లలు కనడం కోసం లింగమార్పిడి శస్త్రచికిత్సను వాయిదా వేసుకున్నారు. తల్లిదండ్రులు అవుదామని వారు నిర్ణయం తీసుకున్నాక డాక్టర్స్ ను సంప్రదించారు. అప్పటికి.. జహాద్ వక్షోజాలను డాక్టర్స్ శస్త్రచికిత్స చేసి తొలగించారు. కానీ.. గర్భసంచీ ఇంకా తొలగించకపోవడంతో జహాద్ గర్భం దాల్చొచ్చని డాక్టర్లు చెప్పారు. దీంతో..జహాద్ లింగమార్పిడి ఆపరేషన్‌ను వాయిదా వేసుకున్నారు. జహాద్ గర్భంతో ఉన్నారు. మార్చ్‌లో ప్రసవం ఉంటుందని వైద్యులు డేట్స్ ఇచ్చారు. ఇక బిడ్డకు మిల్క్ బ్యాంక్ నుంచి సేకరించిన పాలను పడతామని ఆ జంట పేర్కొంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ కు వేల కొద్ది లైకులు, కామెంట్లు వచ్చారు. అంతే కాదు వీరి నిర్ణయానికి అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.