కేశినేని నాని సంచలన నిర్ణయం..షాక్ లో టీడీపీ

విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తాను పోటీ చేయబోనని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కు తేల్చి చెప్పేశారు. అంతేకాదు తన కుమార్తె కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోదని స్పష్టం చేసి టీడీపీ కి షాక్ ఇచ్చారు.

విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో నగర పార్టీ నేతల మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, బొండా ఉమా.. కేశినేని నానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి నాని కూడా కౌంటరిచ్చారు. ప్రధానంగా ఆయన కుమార్తెకు మేయర్ సీటు విషయంలోనే ఈ వివాదం రేగింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు .. నేతలంతా సర్దుకుపోవాలని సూచించారు. అయితే తనపై నగర పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నాని మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. అప్పటి నుండి పార్టీ కి దూరంగా ఉంటూ వస్తున్న నాని..ఇప్పుడు తన నిర్ణయాన్ని తెలిపి షాక్ ఇచ్చారు. ఎన్నికలకు దూరంగా ఉన్న పార్టీ లోనే ఉంటానని చెప్పడం కొస మెరుపు.