సిఎం జగన్‌పై దేవినేని ఉమ విమర్శలు

కరోనా కట్టడికి ఏం చర్యలు తీసుకున్నారు జగన్ గారు?

devineni uma maheswara rao
devineni uma maheswara rao

అమరావతి: ఏపిలో ఒక్కరోజే 7,998 కేసులు, 61 మరణాలు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈవిషయంపై టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. కరోనా పరీక్షల ధరలు పెరిగిపోయాయి. కరోనా పరీక్షలను ప్రజలకు అందుబాటులోకి తేవాలి. బెడ్లు, వెంటిలేటర్ల సంఖ్య పెంచాలి. బాధితుల పట్ల వివక్ష చూపకుండా అవగాహన పెంచేందుకు, కరోనా కట్టడికి, బాధితుల రక్షణకు ఏం చర్యలు తీసుకున్నారు జగన్ గారు?’ అని దేవినేని ఉమ ప్రశ్నించారు. కాగా, రోజువారీ కేసుల నమోదులో జాతీయ స్థాయిలో ఏపీ రెండో స్థానానికి చేరింది. తూర్పు గోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో 24 గంటల వ్యవధిలోనే వెయ్యికి పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/