హనుమాన్‌ ఆలయంలో కేజ్రీవాల్‌ ప్రత్యేక పూజలు

Kejriwal special pooja at Hanuman temple

న్యూఢిల్లీః ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీలోని కన్నాట్ ప్రాంతంలోని ప్రసిద్ధ హనుమాన్‌ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో భార్య సునీతతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కేజ్రీవాల్‌తోపాటు పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌, ఇతర పార్టీ నేతలు కూడా ఈ పూజల్లో పాల్గొన్నారు.

దర్శనం అనంతరం కేజ్రీవాల్‌ నేరుగా ఢిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ మధ్యాహ్నం ప్రెస్‌ మీట్‌లో మాట్లాడనున్నారు. ఆ తర్వాత భోజనం చేసి సాయంత్రం 4 గంటలకు దక్షిణ ఢిల్లీలో, సాయంత్రం 6 గంటలకు తూర్పు ఢిల్లీలో రోడ్‌షోల్లో పాల్గొంటారు. ఈ రోడ్‌షోల్లో పాల్గొనాల్సిందిగా ఢిల్లీ వాసులను కేజ్రీ ఎక్స్‌ వేదికగా ఆహ్వానించారు. మరోవైపు ఢిల్లీలో మే 25న ఆరో విడతలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. జూన్‌ 4న ఫలితాలు విడుదల కానున్నాయి.