జైలు నుంచి రేపు రిలీజ్‌ కానున్న న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ

Navjot Sidhu likely to be released from jail on April 1

పాటియాలా: కాంగ్రెస్ నేత న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ రేపు జైలు నుంచి రిలీజ్ కానున్నారు. 1988లో జ‌రిగిన రోడ్డు ఘ‌ట‌న‌కు చెందిన కేసులో అత‌ను ప్ర‌స్తుతం పాటియాలా సెంట్ర‌ల్‌ జైలు లో శిక్ష అనుభవిస్తున్నారు. సిద్దూ ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఆయ‌న టీమ్ ఈ విష‌యాన్ని పోస్టు చేసింది. శ‌నివారం సిద్ధూ రిలీజ్ అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు జైలు అధికారులు వెల్ల‌డించిన‌ట్లు పేర్కొన్నారు. కానీ జైలు అధికారులు మాత్రం ఇంకా ఈ విష‌యాన్ని ద్రువీక‌రించ‌లేదు. వాస్త‌వానికి చాన్నాళ్ల నుంచి సిద్ధూ జైలు అంశం ప‌రిగ‌ణ‌లో ఉంది. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ఆయ‌న్ను రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ ఆయ‌న‌కు అప్పుడు క్ష‌మాభిక్ష ల‌భించ‌లేదు. రోడ్డుపై దాడి చేసిన కేసులో సిద్ధూకు ఏడాది జైలు శిక్ష ప‌డింది. జ‌న‌వ‌రిలో రిలీజ్ అవుతాడ‌ని భావించారు. కానీ సిద్దూ రిలీజ్ ఆల‌స్య‌మైంది.

జైలు ఫ్యాక్ట‌రీలో ప‌నిచేసినందుకు 60 రోజులు, స‌త్ప్ర‌వ‌ర్త‌న క‌లిగి ఉన్నందుకు 30 రోజుల జైలు జీవితాన్ని త‌గ్గించ‌నున్నారు. ఆ ఆధారంగానే శిక్షా కాలానికి ముంద‌గానే సిద్దూను రిలీజ్ చేయ‌నున్నారు. రెమిష‌న్ ఏ విధంగా ఇవ్వాల‌న్న దానిపై స‌మాలోచ‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని, ఇంకా తుది నిర్ణ‌యాన్ని ఇప్పుడే చెప్ప‌లేమ‌ని పాటియాలా సెంట్ర‌ల్ జైలు సూప‌రింటెండెంట్ మంజిత్ సింగ్ తివానా తెలిపారు. గ‌త ఏడాది మే 20వ తేదీ నుంచి ఆయ‌న జైలులో ఉంటున్నారు. ఆయ‌న‌కు 45 రోజుల రెమిష‌న్ దొరికిన‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి ఈ ఏడాది మే 16న సిద్దూ జైలు నుంచి రిలీజ్ కావాల్సి ఉంది.