ఆర్టీసీ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్స్ వేసుకోకూడదు: ఎండీ స‌జ్జ‌నార్‌

TSRTC MD Sajjanar issue orders on RTC employees dresses

హైదరాబాద్‌ః ఆర్టీసీ ఉద్యోగులు డ్యూటీలో టీష‌ర్ట్స్‌, జీన్స్ వేసుకోవ‌ద్ద‌ని టీఎస్ ఆర్‌టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ఆదేశాలు జారీ చేశారు. ప్ర‌స్తుతం ఆర్‌టీసీ డ్రైవ‌ర్లు, కండ‌క్ట‌ర్లు ఖాకీ యూనిఫామ్ ధ‌రిస్తున్నారు. మిగ‌తా ఉద్యోగులకు డ్రెస్ కోడ్ లేక‌పోవ‌డంతో క్యాజువ‌ల్స్‌లోనే కార్పొరేష‌న్‌, డిపోలకు విధుల‌కు హాజ‌ర‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇక నుంచి ఆర్‌టీసీ ఉద్యోగులంద‌రూ డిగ్నిటీగా ఉండేందుకు ఫార్మ‌ల్స్, యూనిఫామ్‌లో రావాల‌ని ఎండీ స‌జ్జ‌నార్ సూచించారు.

కాగా, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ డ్రెస్ లో కనిపిస్తారు.. బస్టాప్, బస్టాండ్ లలో సూపర్ వైజర్లు తెల్లరంగు దుస్తుల్లో కనిపిస్తారు. డిపోలు, ఇతర ఆర్టీసీ కార్యాలయాల్లో అధికారులు యూనిఫాం అంటూ ఏదీ లేదు. డ్రెస్ కోడ్ లేకపోవడంతో అందరూ జీన్స్, టీషర్ట్స్ దరిస్తున్నారు. కొంతమంది ఉన్నతాధికారులు ఈ తరహా వస్త్రధారణతో విధుల్లో కనిపిస్తున్నారు. దీన్ని ఎండీ సజ్జనార్ తీవ్రంగా పరిగణించారు. ఇటీవల ఆయన గుగుల్ సమావేశాలు నిర్వహించిన సమయాలో చాలా మంది జీన్స్, టీషర్టుల్లో కనిపించడం చాలా చికాకు తెప్పించిందని.. ఈ నేపథ్యంలోనే ఆయన సంస్థ గౌరవ ప్రదంగా ఉండే ఫార్మల్ డ్రెస్సుల్లోనే అధికారులు విధుల్లో కనిపించాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆయా అధికారుల పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుందని అందులో పేర్కొన్నారు.