ఢిల్లీ లిక్కర్ కేసు..కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు

Arvind Kejriwal

న్యూఢిల్లీః ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గొప్ప ఊరటను కల్పించింది. కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ ఇప్పటి వరకు పంపిన ఎనిమిది సమన్లకు అరవింద్ కేజ్రీవాల్ స్పందించలేదు. దీంతో, ఈ విషయంపై ఈడీ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు కోర్టులో కేజ్రీవాల్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రూ. 15 వేల వ్యక్తిగత పూచీకత్తు, రూ. లక్ష సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే ఆయన కోర్టు నుంచి నేరుగా నివాసానికి బయల్దేరారు. కోర్టు బెయిల్ ఇవ్వడం కేజ్రీవాల్ కు పెద్ద ఉపశమనంగా చెప్పుకోవచ్చు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆప్ కు ఇది పెద్ద ఊరటగా భావించవచ్చు.