కవితను కోర్టులో హాజరుపరిచిన ఈడీ

ED to produce BRS leader Kavitha before Delhi court

హైదరాబాద్‌ః ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు… ఆమెను నేరుగా ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తరలించారు. నిన్న రాత్రి ఒకసారి, ఈ ఉదయం మరోసారి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపటి క్రితం ఆమెను ఢిల్లీలోని రౌస్ అరెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశ పెట్టారు. కవితను కస్టోడియల్ ఇంటరాగేషన్ కు ఈడీ అధికారులు కోరుతున్నారు. కవితపై మనీ లాండరింగ్ సెక్షన్ల కింద ఈడీ అభియోగాలు మోపింది. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.