మేఘాంష్‌ శ్రీహరి చిత్రం

సతీష్‌ వేగేశ్న దర్శకత్వం

Meghanshree Srihari, Sameer Vegeshna
Meghansh Srihari, Sameer Vegeshna

స్వాతంత్య్ర దినోత్సవం నాడే రియల్‌స్టార్‌ దివంగత శ్రీహరి పుట్టినరోజు కూడ. ‘రాజ్‌దూత్‌’ చిత్రంతో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీహరి కుమారుడు మేఘాంష్‌ .

జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు సతీష్‌ వేగేశ్న ఇపుడు ఒక యూత్‌ఫుల్‌ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు.

ఇందులో ఇద్దరు హీరోలుగా గ్రేట్‌ యాక్టర్‌ దివంగత డాక్టర్‌ శ్రీహరి తనయుడు మేఘాంష్‌ శ్రీహరి,వేగేశ్న సతీష్‌ తనయుడు సమీర్‌ వేగేశ్న నటించనున్నారు.

ఈచిత్రాన్ని లక్ష్యప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఎంఎల్‌వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మించనున్నారు.. దివంగత శ్రీహరి జయంతి సందర్భంగా శనివారం ఈ సినిమా విషయాన్ని ప్రకటించారు..

దర్శకుడు మాట్లాడుతూ,అన్ని పరిస్థితులు చక్కబడిన తర్వాత వెంటనేషూటింగ్‌ ప్రారంభిస్తామని తెలిపారు.

నిర్మాత సత్తిబాబు మాట్లాడుతూ, ఈసినిమాకు సంబంధించిన విశేషాలు, నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/