‘సన్ ఆఫ్ ఇండియా’
‘కలెక్షన్ కింగ్’ కొత్త చిత్రం ప్రకటన

విలక్షణ నటుడు, ‘కలెక్షన్ కింగ్’ మోహన్‌బాబు నటిస్తున్న చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’ .. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈచిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
గతంలో మేజర్ చంద్రకాంత్ , పుణ్యభూమి నాదేశం వంటి ఎన్నో మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలతో తెలుగుప్రేక్షకులను అలరించిన మోహన్‌బాబు మరోసారి దేశభక్తిని చాటిచెప్పబోతున్నారు.
తాజాగా ఈ టైటిల్ పోస్టర్‌ను కూడ దేశభక్తి నేపథ్యంలో నడిచే కథ అనిచెప్పే విధంగా డిజైన్‌చేశారు. మోహన్‌బాబు సీరియస్ లుక్‌లో కన్పిస్తుండగా, టైటిల్‌లో అశోకచక్రం, బ్యాగ్రౌండ్‌లో ఇండియా మ్యాప్ కన్పించేలా పోస్టర్‌ను రూపొందించారు.
. చాలాగ్యాస్ తీసుకుని సందేశాత్మక చిత్రంలో నటిస్తున్న మోహన్‌బాబు సన్ ఆఫ్ ఇంఇయా టైటిల్ పోస్టర్‌తోనే సినిమాపై ఆసక్తిని పెంచేశారు.
ఈచిత్రాన్ని 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ,లక్ష్మీప్రస్న పిక్చర్స్ బ్యానర్‌పై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు.
డైమండ్ రత్నబాబు రత్నబాబు దర్శకత్వం వహించనున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/