దసరా నుండి కీర్తి ఫస్ట్ లుక్ రిలీజ్

నాని , కీర్తి సురేష్ జంటగా డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న మూవీ దసరా. ఈ మూవీ నుండి సోమవారం కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా గా మార్చి 30 , 2023 లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే నాని తాలూకా లుక్ రిలీజ్ చేసి ఆసక్తి నింపారు. ఇక ఈరోజు కీర్తి లుక్ ను రిలీజ్ చేసారు. ఈ మూవీ లో కీర్తి వెన్నెల అనే క్యారెక్ట‌ర్‌ చేస్తుంది. కీర్తి సురేష్ పెళ్లి దుస్తుల్లో న‌వ్వుతూ చిందులేస్తోంది. ఈ లుక్ ఆమె అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఈ సినిమాలో నాని బొగ్గు గ‌నిలో ప‌ని చేసే కార్మికుడి పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో చిత్రంలో న‌టించ‌ని విధంగా గుబురు గ‌డ్డం పెట్టుకుని కార్మికుడు ఎంత మాసీగా ఉంటాడో అలాంటి లుక్‌లో కనిపించ‌బోతున్నారు నాని. దీనికి ఫుల్ కాంట్రాస్ట్ రోల్‌లో కీర్తి సురేష్ క‌నిపించ‌నుంద‌ని కూడా సినీ స‌ర్కిల్స్ టాక్‌.