కేసీఆర్ జాతీయ పార్టీ..దేశం మొత్తం దుమ్ము లేపాలి – కేటీఆర్

KCR’s national party..the entire country should be dusted – KTR

కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. దసరా రోజున మధ్యాహ్నం 1:19 గంటలకు జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. దసరా పండుగ రోజున టీఆర్‌ఎస్‌ కార్యవర్గ పార్టీ సమావేశం జరుగనున్నది. జాతీయ పార్టీగా మార్పుపై 283 మంది టీఆర్‌ఎస్‌ సభ్యులతో విస్తృత స్థాయి తీర్మానం ప్రవేశపెట్టి.. ఆమోదం తెలుపనున్నారు. అదే రోజున మధ్యాహ్నం 1.19 గంటలకు కేసీఆర్ పార్టీ ప్రకటనను చేయనున్నారు.

కాగా కేసీఆర్ జాతీయ పార్టీ ఫై మంత్రి కేటీఆర్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్తున్న తెలుగు పార్టీని ఆశీర్వదించాలని.. దేశ స్థాయిలో దుమ్ము దుమ్ము లేపాలంటూ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కరీంనగర్ కళాతోవ్సాలు ముగింపు వేడుకలకు మంత్రి కేటీఆర్ నిన్న రాత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా.. తెలంగాణ కళాకారులను గౌరవించేలా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన మంత్రి గంగుల కమలాకర్‌కి ఆయన పత్ర్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కేసీఆర్ జాతీయ పార్టీ ఫై స్పందించారు.

ఈ మధ్య తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవల్‌లో దుమ్ము దుమ్ముగా ఆడుతున్నాయి. తెలుగు సినిమా దేశ స్థాయికి ఎదిగింది. అలానే తెలుగు పార్టీ కూడా దేశం మొత్తం దుమ్ము లేపాలా వద్దా. కేసీఆర్ కొత్త పార్టీకి మీ ఆశీర్వాదం కావాలి. ఇండియా లెవల్‌లో మన కొత్త పార్టీ కూడా దుమ్ము లేపాలి. కేసీఆ‌ర్‌కి కరీంనగర్ అంటే ఎంతో ఇష్టం. ఆ విషయం మీకు బాగా తెలుసు. ఆ రోజు సింహగర్జనను ప్రజలు ఎలా ఆదరించారో.. ఈరోజు కొత్త పార్టీని కూడా అలానే ఆదరించాలన్నారు.