సిటీమార్ సెన్సార్ రిపోర్ట్

కరోనా సెకండ్ వేవ్ ఉదృతి తగ్గడం తో మళ్లీ సినిమా థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. కానీ సరైన సినిమా రాకపోయేసరికి ప్రేక్షకులు థియేటర్స్ కు వచ్చేందుకు ఇంట్రస్ట్ చూపించడం లేదు. ఈ తరుణంలో ఈ నెల 10 న గోపీచంద్ నటించిన సిటీ మార్ మూవీ థియేటర్స్ లోకి రాబోతుంది. గోపీచంద్‌..తమన్నా జంటగా సంపత్ నంది డైరెక్షన్లో స్పోర్ట్స్ నేపధ్య మూవీగా ఈ చిత్రం తెరకెక్కింది. గతంలో సంపత్ నంది, గోపీచంద్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గౌతమ్ నందా’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇపుడు మరోసారి వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ‘సీటీమార్’ సినిమా వస్తోంది.

తాజాగా ఈ సినిమా సెన్సార్ టాక్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేసారు. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో ఎంతో ఎమోషనల్‌గా ఉందని, క్లైమాక్స్ సన్నివేశాలు గూస్ బంప్స్ లెవల్లో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఒలింపిక్స్‌లో మన భారత్ ఎక్కువ పతాకాలు సాధించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కామన్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. సెన్సార్ టాక్ తో చిత్ర యూనిట్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుంది.