ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురి మృతి

హైదరాబాద్ నుంచి పటాన్‌చెరు వెళ్తుండగా ఘటన

road accident

పటాన్‌చెరు: ఔటర్‌ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఢిల్లీకి చెందిన ఆరుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాటిగ్రామం వద్ద ఈ తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన కొందరు బొలేరో వాహనంలో హైదరాబాద్ నుంచి పటాన్‌చెరు వైపు ఔటర్ రింగురోడ్డు మీదుగా వెళ్తున్నారు. పాటిగ్రామ శివారులో అదే రోడ్డుపై వెనక నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఒకటి బొలేరోను ఢీకొట్టింది. దీంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వాహనంలో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఒకరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/