కరోనా బారినపడిన మంచు మనోజ్

దేశంలో మళ్లీ కరోనా తో పాటు ఓమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో పలు రాష్ట్రాలు మళ్లీ కర్ఫ్యూ బాటపట్టాయి. ఇక చిత్రసీమలో కూడా కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఈ మధ్యనే కమల్ హాసన్ , విక్రమ్ , వడివేలు వంటి వారు కరోనా బారినపడగా..తాజాగా టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సైతం కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే తెలిపారు. గత వారంలో తనను కలిసిన ప్రతి ఒక్కరూ వెంటనే టెస్టులు చేయించుకుని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంచూ మనోజ్ కోరారు.

వైద్యుల సంరక్షణలో తాను బాగానే ఉన్నానని తెలిపిన మనోజ్.. ఎవరు కూడా దీనిపై ఆందోళన చెందనవసరం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే తాను కోలుకుని.. మళ్ళీ అందరి ముందుకు వస్తానని ప్రకటన చేశారు మంచు మనోజు. ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 9,195 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. దీంతో నిన్నటి కంటే 44 శాతం అధికంగా కేసులు పెరిగాయి. కరోనాతో మరో 302మంది బాధితులు మృతిచెందారని తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.47కోట్లు దాటింది. ఇక కరోనా బారిన పడి ఇప్పటివరకు దేశంలో 4,80,592మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 7,347మంది కోలుకోగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3.42కోట్లకు పైగా మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 77,002. కరోనా యాక్టివ్‌గా ఉన్నాయి.