ఉక్రెయిన్‌లో జోబైడెన్ పర్యటిచడం లేదు : వైట్ హౌస్

వాషింగ్టన్ : ఉక్రెయిన్‌ పై రష్యా ఎడతెగని యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలు దేశాధినేతలు ఉక్రెయిన్‌లో పర్యటించి ఆ దేశానికి తమ మద్దతు తెలిపారు. ఇలాంటి సమయంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కూడా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు వెళ్లి మద్దతు తెలుపుతారని వార్తలు వచ్చాయి. అయితే ఈ కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని, కీవ్‌లో బైడెన్ పర్యటించబోవడం లేదని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి వెల్లడించారు. యూరోపియన్ యూనియన్‌కు చెందిన పలువురు కీలక నేతలు కీవ్‌లో పర్యటించి అక్కడి పరిస్థితులను సమీక్షించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ను తమ దేశానికి రావలసిందిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్‌కీ ఆహ్వానించాడు. దీనిపై జెన్ సాకి స్పందిస్తూ.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు బైడెన్‌ను పంపే యోచన ఏదీ లేదని స్పష్టం చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/