సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో కేసీఆర్ తన సీఎం పదవికి రాజీనామా చేసారు. కారులో రాజభవన్ కు వెళ్లిన సీఎం కేసీఆర్ .. గవర్నర్ కు రాజీనామా లేఖను అందించారు.

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ నుంచి ఆధిక్యంలో దూసుకుపోయింది. ఈవీఎం ఓట్ల కౌంటింగ్ లో హస్తం హవా కొనసాగింది. కాంగ్రెస్ 64 స్థానాల్లో విజయభేరి మోగించింది. బీఆర్ఎస్ 40 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 8 చోట్ల విజయం సాధించింది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. డిసెంబర్ 9లోపు నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తోంది.