దసరా సందర్భంగా పాదయాత్ర కు రెండు రోజుల విరామం ఇచ్చిన రాహుల్

Rahul gave a two-day break to the padayatra

కమ్యూనిటీ వెరిఫై చేయబడిన చిహ్నం

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడి యాత్ర కు రెండు రోజుల విరామం ఇచ్చారు. గత కొద్దీ రోజులుగా రాహుల్ భారత్ జోడి యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కర్ణాటకలో రాహుల్ పాదయాత్ర జరుగుతోంది. కాగా దసరా ఉత్సవాల సందర్భంగా కొడగులో రాహుల్ 2 రోజులు విశ్రాంతి తీసుకోనున్నారు. అక్టోబర్ 6న తిరిగి రాహుల్ జోడో యాత్ర పున:ప్రారంభం కానుంది.

అలాగే ఈ నెల 6న జరిగే రాహుల్ జోడో యాత్రలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాల్గొననున్నారు. రాహుల్ తో కలిసి నడవనున్నారు. సోనియాగాంధీ రాహుల్ పాదయాత్రలో పాల్గొననుండటంతో.. కర్ణాటక కాంగ్రెస్ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. సోనియాగాంధీ పాల్గొననుండటంతో జోడో యాత్రకు మరింత జోష్ వస్తుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక తెలంగాణ లో రాహుల్ పాదయాత్ర అక్టోబర్ 24 నుండి మొదలుకాబోతుంది. రాష్ట్రంలో రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర 13 రోజుల పాటు సాగనుంది. రాహుల్ గాంధీ తెలంగాణలో మొత్తం 359 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. 13 రోజులపాటు రోజు వారీగా రాహుల్ గాంధీ పాదయాత్ర లో పాల్గొనే నియోజకవర్గాల జాబితాను కూడా టీపిపిసి సిద్ధం చేసింది. రాహుల్ గాంధీ పాదయాత్ర మొదట మక్తల్ నియోజకవర్గంలో కృష్ణ మండలం కృష్ణ గ్రామం వద్ద తెలంగాణ రాష్ట్రంలో కి ఎంట్రీ ఇవ్వనుంది.