సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా

గత బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులందరికీ రైతు బంధు వేసింది..కానీ ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ మాత్రం కేవలం సాగు చేసే భూములకు మాత్రమే రైతు బంధు (రైతు భరోసా ) వేయాలని డిసైడ్ అయ్యింది. గత ప్రభుత్వంలో కొండలు, గుట్టలు, రోడ్లు, బిల్డింగులు.. ఇలా నిర్దిష్ట విధానం లేకుండా రైతుబంధు పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది.

ఈసారి రైతుభరోసా స్కీమ్‌కు స్పష్టమైన మార్గదర్శకాల తయారీపై దృష్టి పెట్టింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో నలుగురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో తొలి సమావేశం నిర్వహించింది. సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా పేరుతో ప్రభుత్వం సాయాన్ని అందించాలని, సాగులో లేని భూములకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిన అవసరం లేదనే చర్చ జరిగింది. అలాగే ఐదు ఎకరాల వరకే రైతు బంధు ఇవ్వాలని డిసైడ్ చేస్తుంది. దీనిపై అతి త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.