చ‌ల్లా ధ‌ర్మారెడ్డి ఫై కేసీఆర్ ప్రశంసలు

పరకాల ప్రజా ఆశీర్వాద సభలో చ‌ల్లా ధ‌ర్మారెడ్డి ఫై ప్రసంశలు కురిపించారు గులాబీ బాస్ , సీఎం కేసీఆర్. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద‌లో కేసీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..చల్లా ధ‌ర్మారెడ్డి ఉత్త‌మ‌మైన మ‌నిషి, ప్ర‌జ‌ల మనిషి మ‌నిషి..ఎప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే అడిగే వ్యక్తి అని కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. ఇలాంటి మంచి అభ్య‌ర్థిని గెలిపిస్తే రైతుబంధు 16 వేలు అయిత‌ది.. 24 గంట‌ల క‌రెంట్ ఉంట‌ది.. అన్ని విధాలా ప‌ర‌కాల అభివృద్ధి జరుగుతుందన్నారు. పరకాల అభివృద్ధి విష‌యంలో ఏం కావాలంటే అది చేసి పెట్టే బాధ్య‌త నాది. మరో పార్టీ వ‌స్తే పరకాల మ‌ళ్లీ ఆగ‌మాగం అవుతది. పాలిచ్చే బ‌ర్రెను అమ్ముకొని దున్న‌పోతును తెచ్చుకున్న‌ట్లు అవుత‌ది అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

కాక‌తీయ మెగా టెక్స్ టైల్స్ పార్కు ఇక్క‌డ‌కు రావ‌డం చాలా సంతోషం. చాలా మంది మా పిల్ల‌ల‌కు ఉద్యోగాలు వ‌స్తాయ‌ని ధ‌ర్మారెడ్డి చెబుతుండ్రు. నిజంగా చాలా లాభం జ‌రుగుత‌ది. ప‌ర‌కాల‌కు ఏదో కోర్టు అడిష‌న‌ల్‌గా అవ‌స‌రం ఉంది. మీరు అనుకుంటే అయ్యే ప‌ని అంటున్న‌డు. అదే అయ్యే ప‌ని అయితే ప‌ర‌కాల‌లో పెట్టిస్తా త‌ప్ప‌కుండా. న్యాయ‌వాద మిత్రుల‌కు మ‌న‌వి చేస్తున్నా. హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌తో మాట్లాడి కోర్టు తెప్పించే ప్ర‌య‌త్నం చేస్తాను అని కేసీఆర్ హామీ ఇచ్చారు.