ఫ్యాన్స్ కు క్షేమాపణలు చెప్పిన వైష్ణవ్ తేజ్

ఉప్పెన సినిమాతో మెగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్..ఆ తర్వాత కొండపాలెం మూవీ తో ఒక అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఆదికేశవ్ మూవీ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ లో హీరోయిన్ గా శ్రీలీల నటించడంతో సినిమాకు మరింత క్రేజ్ ఏర్పడింది. ఇటీవల విడుదలైన సినిమా తాలూకా సాంగ్స్ , పోస్టర్స్ సినిమా ఫై అంచనాలు పెంచేయగా..ఈరోజు సినిమా తాలూకా ట్రైలర్ రిలీజ్ అవుతుందని రెండు రోజుల క్రితమే మేకర్స్ ప్రకటించారు. కానీ తీరా ఆ సమయానికి సాంకేతిక కారణాలతో ట్రైలర్ రిలీజ్ చేయలేకపోతున్నాం..కొత్త డేట్ ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపి క్షేమాపణలు కోరారు. ఈ ప్రకటన తో మెగా ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.

అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే వారం ఈ ఈవెంట్ ఉండనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు జోజు జార్జ్ విలన్ గా నటిస్తుండగా..శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేసాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు.