ఎవ్వరు టెన్షన్ పడొద్దు..మనమే గెలుస్తున్నాం – కేసీఆర్

తెలంగాణ పోలింగ్ కు సంబదించిన ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీ నేతలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. దాదాపు అన్ని పోల్ సర్వేలు కాంగ్రెస్ విజయం సాదించబోతుందని తేల్చి చెప్పడం తో..అధికార పార్టీ నేతల్లో , కార్యకర్తల్లో టెన్షన్ మొదలైంది. అదేంటి ఇలా వచ్చాయి అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ తరుణంలో గులాబీ బాస్..ప్రగతి భవన్‌లో పలువురు పార్టీ నేతలతో సమావేశమై భరోసా ఇచ్చారు. ఎగ్జిట్ పోల్స్ లెక్కలు తప్పవుతాయని..గెలుపు మనదే అని ధీమా వ్యక్తం చేసారు.

జిల్లా నాయకులకి కూడా సీఎం కేసీఆర్‌ ఫోన్లు చేసినట్టు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో పోలింగ్ శాతం, ప్రజల మధ్య చర్చకు వస్తున్న అంశాలు అన్నింటిపై ఆరా తీశారు. అందరితో మాట్లాడిన సీఎం కేసీఆర్‌ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంతో హైరానా పడొద్దని సూచించారు. ఆఖరి నిమిషంలో పోలింగ్ శాతం భారీగా పెరిగిందని అందతా బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉంటుందని అనే విశ్లేషణ చేశారు. ఎవరూ టెన్షన్‌ పడకుండా ప్రశాంతంగా ఉండాలని కేసీఆర్‌ సూచించారు. ఫలితాలు వచ్చే వరకు ఎలాంటి డిస్కషన్స్ పెట్టుకోవద్దని చెప్పారు. మూడో తేదీని ఫలితాలు వచ్చిన తర్వాత అందరం కలిసి సంబరాలు చేసుకుందామని భరోసా ఇచ్చారు.