ఎన్95 మాస్కులపై కేంద్రం హెచ్చరికలు

కరోనా వ్యాప్తిని  ఎన్95 మాస్కులు అడ్డుకోలేవని స్పష్టీకరణ

government Warns Against Use Of N-95 Masks With Valved

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా అందరు మాస్కులు ధరిస్తున్న విషయం తెసిందే. అయితే మాస్కుల వినియోగంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కవాటం ఉన్న ఎన్95 మాస్కులు వినియోగించవద్దని, ఇవి వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేవని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖలోని ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ఆరోగ్య కార్యకర్తలు కాకుండా ఇతరులు కవాటాలతో ఉన్న ఈ ఎన్95 మాస్కులను ఇష్టం వచ్చినట్టు ఉపయోగించడాన్ని తాము గమనించినట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో ఇంట్లో తయారు చేసిన రక్షణ కవచాలను, సాధారణ మాస్కులను వినియోగించేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. ఇక ఇంట్లొనే మాస్కు ఎలా తయారు చేయాలనే దానిపై కేంద్రం ఇప్పటికే మార్గదర్శాకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన సూచనలను కేంద్ర ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/