బ్రహ్మాస్త్ర మూవీపై కంగనా హాట్ కామెంట్స్

,

బ్రహ్మాస్త్ర మూవీపై నటి కంగనా హాట్ కామెంట్స్ చేయడం ఇప్పుడు మీడియా లో వైరల్ గా మారింది. భారతదేశ చరిత్రలో భారీ బడ్జెట్​, అత్యాధునిక సాంకేతికతతో తెరకెక్కించిన మూవీ బ్రహ్మాస్త్ర. తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో విడుదల అయ్యింది. దక్షిణాది భాషల్లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి డిస్ట్రిబ్యూట్​ చేయడం విశేషం. స్టార్ స్టూడియోస్​, ధర్మ ప్రొడక్షన్స్​, ప్రైమ్ ఫోకస్​, స్టార్​లైట్ పిక్చర్స్ ​సంయుక్తంగా నిర్మించిన బ్రహ్మాస్త్రం సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి కేవలం అడ్వాన్స్ బుకింగ్ తోనే 20 కోట్ల వసూళ్లు వచ్చినట్టు అంచనా వేస్తున్నారు. ఇందులో తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్ కోటిపైనే ఉండటం గమనార్హం. సినిమా కు పాజిటివ్ టాక్ రావడం..ఫస్ట్ డే పలు రికార్డ్స్ బ్రేక్ చేయడం తో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటుంది.

అయితే బ్రహ్మాస్త్ర మూవీ టీమ్‌పై హీరోయిన్ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్ట్‌ను షేర్ చేస్తూ బ్రహ్మాస్త్ర టీమ్‌ని టార్గెట్ చేశారు. అయాన్ ముఖర్జీ రూ.600 కోట్లు తగలబెట్టాడంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలో విమర్శించారు. అతను జీవితంలో ఒక్క మంచి సినిమా కూడా తీయలేదంటూ ఫైర్ అయ్యారు. అదేవిధంగా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు. అతను తన సినిమా స్క్రిప్ట్‌ల కంటే ప్రతి ఒక్కరి శృంగార జీవితంపైనే ఎక్కువ ఆసక్తిని చూపిస్తాడని అన్నారు. నకిలీ కలెక్షన్లు, ఫేక్ రివ్యూలు కొనుగోలు చేస్తాడని ఆరోపించారు. హిందూ మతాన్ని, సౌత్‌వేవ్‌ను తొక్కే ప్రయత్నం చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బ్రహ్మాస్త్ర మూవీ బడ్జెట్ సమకూర్చడానికి ఫాక్స్ స్టూడియోస్ తనంతట తానుగా అమ్ముకోవాల్సి వచ్చిందని.. మరి ఇలాంటి సినిమాల వల్ల ఎన్ని స్టూడియోలు మూతపడతాయో అని కంగనా రనౌత్ అన్నారు. ‘అయాన్ ముఖర్జీని మేధావి అని పిలిచిన ప్రతి ఒక్కరినీ వెంటనే జైలులో పెట్టాలి. ఈ చిత్రాన్ని తీయడానికి 12 ఏళ్లు తీసుకున్నాడు. ఈ సినిమాను 400 రోజులకుపైగా షూట్ చేసి.. 14 మంది డీఓపీలను, 85 మంది అసిస్టెంట్ డైరెక్టర్లను మార్చి రూ.600 కోట్లు కాల్చి బూడిద చేసారని ఆమె అన్నారు. ప్రస్తుతం కంగనా చేసిన కామెంట్స్ బాలీవుడ్ లో వైరల్ గా మారాయి.