వైరల్ ప్లెక్సీ : కేసీఆర్ కాబోయే ప్రధాని..ఏపీకి కాబోయే సీఎం పవన్

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ లో బిజెపి vs టిఆర్ఎస్ మధ్య వారు నడుస్తుంటే..ఏపీలో జనసేన vs వైస్సార్సీపీ వార్ నడుస్తుంది. ఎక్కడ కూడా ఎవ్వరూ కూడా తగ్గడం లేదు. ఈ తరుణంలో ఓ ప్లెక్సీ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ ప్లెక్సీ లో కేసీఆర్ కాబోయే ప్రధాని..ఏపీకి కాబోయే సీఎం పవన్ అంటూ రాసి ఉంది. ప్రస్తుతం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బి(టి)ఆర్ఎస్ గా పార్టీ ప్రకటించారు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేసినప్పుడు ఏపీలో కూడా కేసీఆర్ ను స్వాగతిస్తూ పెద్ద ఎత్తున ప్లెక్సీ లు కట్టారు. కొన్ని సందర్భాలలో కేసీఆర్ ప్లెక్సీ లకు పాలాభిషేకాలు చేశారు.

తాజాగా గుంటూరు జిల్లా తెనాలిలో ఓ అభిమాని.. ఏకంగా కేసీఆర్‌కు ప్ర‌ధాని పీఠం క‌ట్ట‌బెట్టేశారు. ఆయ‌న ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో గద్దె గోపాలకృష్ణమూర్తి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. ఏపీకి ముఖ్యమంత్రిగా పవన్‌ రావాలని, దేశ ప్రధానిగా కేసీఆర్‌ కావాలని కోరుతూ ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణను దేశంలోనే అగ్రస్థానానికి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్‌ ప్రధాని కావాలని దేశమంతటా ప్ర‌జ‌లు ముక్తకంఠంతో కోరుకొంటున్నారని చెప్పేందుకు ఈ ఫ్లెక్సీనే నిదర్శన‌మ‌ని.. టీఆర్ఎస్ వ‌ర్గాలు అప్పుడే భాష్యం చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. ప్రస్తుతం ఈ ప్లెక్సీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది.

ఏపీలో ను పవన్ కళ్యాణ్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు, జగన్ వల్ల రాష్ట్రానికి పెద్దగా ఒరిగింది ఏమిలేదని , పవన్ కళ్యాణ్ కు ఈసారి ఛాన్స్ ఇచ్చి చూద్దామని గ్రామాల్లో , పట్టణాల్లో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఏ పదవి లేనప్పుడే తన జేబులో నుండి డబ్బును ప్రజల కోసం ఖర్చు చేస్తున్నారని..అలాంటిది సీఎం పదవి ఇస్తే ఇంకెంత చేస్తాడో అని అంత భావిస్తున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ సైతం ప్రతి సమస్య ఫై పోరాడుతున్నారు. అందుకే కావొచ్చు తెనాలి లో ఆలా ప్లెక్సీ పెట్టి ఉంటారని మాట్లాడుకుంటున్నారు.