ఢిల్లీకి పయనమైన పవన్‌ కళ్యాణ్‌

అమరావతి సమస్యపై బిజెపి పెద్దలతో చర్చ

Pawan Kalyan
Pawan Kalyan

హైదరాబాద్‌: ఏపి రాజధానులపై చర్చించేందుకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీకి పయనమయ్యారు. రాజధానిని అమరావతి నుండి కదలనివ్వను అంటూ రైతులకు హామీ ఇచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఢిల్లీకి బయలుదేరారు. ఆయనతో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన పవన్ కాసేపట్లో ఢిల్లీ చేరుకుని బిజెపి అధిష్ఠానంతో భేటీ కానున్నారు. రేపు మధ్యాహ్నం వరకు అక్కడే ఉంటారు. ఏపిలో మూడు రాజధానుల అంశాన్ని జాతీయ స్థాయిలో తీవ్రతరం చేయాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ నేతలతో చర్చించేందుకు పవన్ వెళ్లారు. రాజధాని అంశంపై
బిజెపితో కలిసి పోరాడడానికి జనసేన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/