కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అరెస్ట్

police arrested rajagopal reddy

బిజెపి అభ్యర్థి , మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేసారు. మునుగోడు ఉపఎన్నిక కోసం గొల్ల కురుమలను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తూ మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. గొర్రెల పథకం పేరుతో లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమచేసిందని, ఎన్నికలు అవగానే డబ్బులు వెనక్కి తీసుకుందని రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గొల్ల కురుమ సోదరుల ఖాతాలకు సంబంధించిన ఫ్రీజ్ ఎత్తివేసేంతవరకు ధర్నా విరమించేది లేదని , దాదాపు రెండు గంటలు ఆయన ధర్నా చేశారు. ధర్నా విరమించాలని పోలీసులు కోరినా.. వినకుండా అలాగే ధర్నా చేస్తుండడంతో కోమటిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ధర్నాలో గొల్ల కురుమలు, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ధర్నా చేస్తున్న రాజగోపాల్ రెడ్డిని తీవ్ర ఉద్రిక్తతల మధ్య అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. బీజేపీ కార్యకర్తలు, గొల్ల కురుమలు రాజగోపాల్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా.. పోలీసుల కార్ల ముందు బైఠాయించే ప్రయత్నం చేశారు. తోపులాట, ఉద్రిక్తల మధ్య రాజగోపాల్ రెడ్డిని మునుగోడు పోలీస్ స్టేషన్ కు తరలించారు.