బన్సీలాల్‌పేట మెట్ల బావిని తిరిగి ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్‌

minister-ktr-inaugurates-bansilalpet-stepwell-on-december-5th

హైదరాబాద్‌ః దాదాపు 300 ఏండ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్‌ బన్సీలాల్‌పేటలోని పురాతన మెట్ల బావిని మంత్రి కెటిఆర్ ఈ నెల 5న తిరిగి ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిజాం కాలంలో నిర్మించిన బావి కాలక్రమేణా డంపింగ్ యార్డ్‌గా మారిపోయిందన్నారు.

మంత్రి కెటిఆర్‌ ప్రత్యేక చొరవతో మెట్ల బావికి బావికి పూర్వ వైభవం వచ్చిందన్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా పరిసరాల అభివృద్ధి చేశామన్నారు. రానున్న రోజుల్లో గొప్ప పర్యాటక ప్రాంతంగా మారనుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చారిత్రక కట్టడాలకు పూర్వ వైభవం తీసుకొచ్చామని వెల్లడించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/