కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు

రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ, అభివృద్ధి కార్య క్రమాలు చేస్తున్నట్టు వెల్లడి

TS CM Kcr May Day wishes
TS CM Kcr May Day wishes

Hyderabad: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం, మే డే సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ కార్మిక, కర్షకులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మే డే స్ఫూర్తితో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. కార్మికుల సంక్షేమానికి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని , ఉత్పత్తి, సేవా రంగాలను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. నిరుద్యోగులు, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నదని కేసీఆర్‌ తెలిపారు.

అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/