దట్టమైన అడవుల్లో రామారావు ఆన్ డ్యూటీ..

క్రాక్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మాస్ మహారాజ రవితేజ ..ప్రస్తుతం ఒకటి రెండు కాదు మూడు , నాల్గు సినిమాలను లైన్లో పెట్టాడు. అతి త్వరలో రమేష్ వర్మ డైరెక్షన్లో చేస్తున్న ఖిలాడీ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. త్రినాద్ రావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేస్తున్నారు. అలాగే టైగర్ నాగేశ్వరరావ్ అనే సినిమా కూడా చేస్తున్నారు. వీటితో పాటు శరత్ మాండవ డైరెక్షన్లో రామారావు ఆన్ డ్యూటీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొస్తుంది. ఫైనల్ షెడ్యూల్ యాక్ష‌న్ సీక్వెన్సెస్‌ను తెరకెక్కిస్తున్నారు. అందుకోసం మారెడుమిల్లి అటవీ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ ఫైనల్ షెడ్యూల్ జరుగుతుంది.

ఈ చిత్రంలో దివ్యాంకా కౌశిక్, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి, నాజర్, నరేశ్, పవిత్రా లోకేష్, సురేఖా వాణి కీలక పాత్రధారులు. స్యామ్‌ సీఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.