వసంత్‌ విహార్‌లో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ..ప్రస్తుతం ఢిల్లీ లో బిజీ బిజీ గా గడుపుతున్నారు. స‌మాజ్‌వాదీ పార్టీ వ్య‌వస్థాప‌కుడు ములాయం సింగ్ యాద‌వ్ అంత్యక్రియ‌ల‌కు హాజ‌ర‌య్యేందుకు మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఉత్త‌ర ప్ర‌దేశ్ వెళ్లిన కేసీఆర్‌… ములాయం అంత్య‌క్రియ‌లు ముగిసిన త‌ర్వాత అటు నుంచి అటే ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో ఇటీవ‌లే ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రాంతీయ కార్యాల‌యాన్ని ప‌రిశీలించారు. పార్టీ కార్యాలయంలోని అన్ని రూములు, ఛాంబర్లను దగ్గర ఉండి పరిశీలించడం జరిగింది.

ఈరోజు వసంత్‌ విహార్‌లో జరుగుతున్న నిర్మాణ పనులను మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌ కుమార్, దామోదరరావు, వద్దిరాజు రవిచంద్రలతో కలిసి పరిశీలించారు. అక్కడ నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజనీర్లను పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకుని… పలు సూచనలు చేశారు. సుమారు 40 నిమిషాల పాటు సీఎం కేసీఆర్‌… భవన పనులు జరుగుతున్న ప్రదేశంలో గడిపి, అన్ని అంశాలు పరిశీలించి పనులు ముమ్మరం చేయాలని నిర్ధేశించినట్లు తెలుస్తుంది.