9న సిఎం జగన్‌ను కలవనున్న సినీ పెద్దలు

బాలకృష్ణతో సహా అందరికీ ఆహ్వానం

CM Jagan visit AP secretariat
CM Jagan

అమరావతి: ఈనెల 9న సినీ పెద్దలు ఏపి సిఎం జగన్‌తో సమావేశం కానున్నారు. ఈసదర్భంగా నిర్మాత సి. కల్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ..జూన్ 9 మధ్యాహ్నం 3 గంటలకు సిఎం జగన్‌తో అపాయింట్‌మెంట్ దొరికింది. ఈ మీటింగ్‌కు రావాలంటూ నంద‌మూరి బాల‌కృష్ణ‌గారికి నేను ఫోన్ చేసి ఆహ్వానించాను. అయితే జూన్ 10న బాలకృష్ణ‌గారి పుట్టినరోజు. ఆయ‌న కాస్త బిజీగా ఉండ‌టం వ‌ల్ల రాలేక‌పోయే అవ‌కాశాలున్నాయి. చిరంజీవిగారు, ఇత‌ర పెద్ద‌లు సిఎం జగన్‌ను కలిసి సినీ పరిశ్రమ సమస్యలు, చిత్రీకరణ అనుమతులపై చర్చిస్తామని ఆయన తెలిపారు.
కాగా ఇప్పటికే ఈవిషయపై సిఎం కెసిఆర్‌ను కలిసి చర్చలు జరిపిన విషయం తెలిసిందే.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/