జగదీష్ రెడ్డి ని తలచుకొని ఎమోషన్ లకు గురైన కేసీఆర్

బంగారిగడ్డ సభలో మంత్రి జగదీశ్ రెడ్డి ని తలచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమోషనల్ కు గురయ్యారు. రీసెంట్ గా ఎన్నికల కమిషన్ మంత్రి జగదీశ్ రెడ్డి ఎన్నికల ఉల్లంఘన చేసారని , 48 గంటల పాటు ఆయన ఎలాంటి ప్రచారం చేయకూడదని , మీడియా ముందు ఇంటర్వూస్ ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేసారు. ఈసీ ఆదేశాల ఫై సీఎం కేసీఆర్ సభ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన ఏం తప్పు చేశారని జగదీష్ రెడ్డిపై నిషేధం విధించారని కేసీఆర్ ప్రశ్నించారు. ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు మంత్రి జగదీష్ రెడ్డి లేకుండా ఏ సభలోనూ ప్రసంగించలేదని గుర్తు చేసుకుని బాధపడ్డారు.

‘జగదీశ్ రెడ్డి లేకుండా గత 20 ఏళ్లల్లో నేను ఏ సభలోనూ మాట్లాడలేదు. 2001 నుంచి ఆయన ఉద్యమంలో ఉన్నాడు. నేను ఇక్కడకు వచ్చే ముందు బాధతో వచ్చా. ఏం తప్పు చేశారు జగదీశ్వర్ రెడ్డి. ఆయన్ను ఇక్కడి నుంచి ఎందుకు పంపిచారు. ఎందుకు నిషేధించారు. ఆయనేమైనా గుండాగిరి చేసిండా.. ఎవరినైనా కొట్టిండా.. దౌర్జన్యం చేసిండా.. అసలు టీఆర్ఎస్‌కు ఆ చరిత్ర ఉందా.. వామపక్షాలకు ఆ చరిత్ర ఉందా.. ఏం దౌర్జన్యం చేశాడని మంత్రిపై నిషేధం విధించారు. ప్రశాంత వాతారవణంలో మా ప్రచారం మేం చేసుకుంటున్నాం. ఈ రోజు నాకు ఆ బాధ ఉంది’ అంటూ కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.