పాలేరు సభ వేదికగా తుమ్మల ఫై కేసీఆర్ ఫైర్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారం చేపట్టిన బిఆర్ఎస్..ఆ తర్వాత ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ సాధించాలని చూస్తుంది. ఇదే క్రమంలో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ , బీజేపీ లు సైతం ఈసారి తెలంగాణ లో అధికారం చేపట్టాలని తహతలాడుతున్నాయి. ఎన్నికల పోలింగ్ కు 33 రోజులు మాత్రమే ఉండడం తో అన్ని పార్టీలు తమ ప్రచారం తో హోరెత్తిస్తున్నారు.

ఈ క్రమంలో సీఎం కేసీఆర్ సైతం గత కొద్దీ రోజులుగా జిల్లాల పర్యటనలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాలో సభలు నిర్వహించగా..శుక్రవారం పాలేరు , మహబూబాబాద్ , వర్ధన్నపేట లలో సభలో నిర్వహించారు. ఈ సభల్లో కాంగ్రెస్ , బిజెపి నేతలపై విమర్శలు కురిపించారు. ముఖ్యంగా పాలేరు సభలో మాజీ మంత్రి , రీసెంట్ గా కాంగ్రెస్ లో చేరిన తుమ్మల ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు.

తుమ్మ‌ల ఓడిపోయి మూల‌కు కూర్చుంటే.. పిలిచి మంత్రిని చేశాను అని కేసీఆర్ తెలిపారు. ఎమ్మెల్యే చేసి ఐదేండ్లు ఖ‌మ్మం జిల్లా మీద ఏక‌ఛ‌త్రాధిపత్యం ఇస్తే, ఒక్క సీటు రాకుండా చేశార‌ని తుమ్మ‌ల‌పై కేసీఆర్ నిప్పులు చెరిగారు. పాలేరును ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని… బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే భక్త రామదాసు ప్రాజెక్టు పూర్తి చేశామని అన్నారు. మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో ఓడిపోయి ఇంట్లో ఉంటే పిలిచి ఎమ్మెల్సీని చేసి.. మంత్రి పదవి ఇచ్చామన్నారు. ఇంత చేస్తే ఖమ్మంలో ఆయన పార్టీకి చేసింది గుండు సున్నా అని ఫైర్ అయ్యారు. పైగా తాను మోసం చేశానని ఆయన ఆరోపించడంపై మండిపడ్డారు. పార్టీ వైఖరి గమనించి ప్రజలు ఓటు వేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.