బీసీలకు పెద్ద పీఠం వేసిన టీ కాంగ్రెస్

2023 నవంబర్ 30 మన జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ పెద్ద పీఠం వేసింది. మొత్తం 119 స్థానాలకు గాను 100 మంది అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం..మరి 19 మంది అభ్యర్థులను మాత్రం పెండింగ్ లో పెట్టింది. అయితే రెండు విడతల్లో ప్రకటించిన అభ్యర్థుల లిస్ట్ లో 27 స్థానాలను బీసీలకు టికెట్ కేటాయించి వార్తల్లో నిలిచింది. అధికార పార్టీ బిసిలను పెద్దగా పట్టించుకోకపోయినా తాము బీసీలకు న్యాయం చేశామని చెప్పుకొస్తుంది.

అలాగే రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ లో చేరిన నేతలకు సైతం టికెట్ కేటాయించి వారిని సంతృప్తి పరిచింది. దాదాపు 15 మంది కొత్త వారికీ టికెట్ కేటాయించింది.వీరిలో కొందరు ఇతర పార్టీల్లోంచి కాంగ్రెస్‌లో చేరిన వారు కాగా, మరికొందరు కొత్తగా కాంగ్రెస్‌లో ప్రస్థానం మొదలుపెట్టిన వారు ఉన్నారు.

ఆ 15 మంది ఎవరంటే..

ఇటీవల పార్టీలో చేరిన వారికి కేటాయించిన స్థానాలు..

  • ఆదిలాబాద్ – కంది శ్రీనివాస్ రెడ్డి
  • ఆసిఫాబాద్ – శ్యామ్ నాయక్
  • ముతోల్ – నారాయణ పటేల్
  • కూకట్ పల్లి – బండి రమేష్
  • శేరిలింగంపల్లి – జగదీష్ గౌడ్
  • తాండూరు – మనోహర్ రెడ్డి
  • సికింద్రాబాద్ కంటోన్మెంట్ – వెన్నెల
  • మహబూబ్ నగర్ – ఎన్నం శ్రీనివాస్ రెడ్డి
  • మునుగోడు – రాజ్ గోపాల్ రెడ్డి
  • పాలకుర్తి – యశశ్విని
  • పరకాల – రేవూరి ప్రకాష్ రెడ్డి
  • వర్ధన్నపేట -నాగరాజు
  • ఖమ్మం – తుమ్మల నాగేశ్వర్ రావు
  • పాలేరు – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • పినపాక – పాయం వెంకటేశ్వర్లు