నేడు హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి పర్యటన
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
Vice President Venkaiah Naidu
హైదరాబాద్ : నేడు నగరంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, మల్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు. శనివారం ఉయదం విద్యానగర్‌లోని అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య సందర్శిస్తారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి విద్యానగర్ వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నిలిపివేయడంగానీ, మళ్లించడం గానీ జరుగుతుందని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
ఉదయం 8.50 గంటల నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, ఎన్‌ఎఫ్‌సీఎల్, తాజ్‌కృష్ణా, అన్సారీమంజిల్, ఆర్టీవో కార్యాలయం, వీవీ స్టాచ్యూ, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, ఎన్టీఆర్ ఘాట్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, అంబేద్కర్ విగ్రహం, లిబర్టీ, హిమాయత్‌నగర్, ఫీవర్ దవాఖాన, హిందీ మహావిద్యాలయ వరకు, మళ్లీ 10.50 గంటలకు అదే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని తెలిపారు. ఈనేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/