బండి సంజయ్ ఫై నిప్పులు చెరిగిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..మరోసారి తెలంగాణ బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ పై నిప్పులు చెరిగారు. ఆదివారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేంద్రం ఫై , తెలంగాణ బిజెపి నేతల ఫై మండిపడిన కేసీఆర్..సోమవారం సైతం మీడియా సమావేశంలో నిప్పులు చెరిగారు. తెలంగాణ ఉద్యమంలో నువు ఎక్కడ పన్నావ్ ? నీ ఉనికి తెలంగాణ సమాజానికి తెలియదని బండి సంజయ్ పై నిప్పులు చెరిగారు. నిన్న మొన్న వచ్చి మాట్లాడుతున్నావ్… రాష్ట్రంలో ,దేశంలో నువు ఎవడికి తెలుసని అగ్రహించారు.

రాయలసీమ కు నీళ్లు రావాలని బజాప్త చెప్పానని.. . ఇప్పుడు అదే చెప్తున్నానని స్పష్టం చేశారు. కృష్ణ నదిలో నీళ్లు లేవని.. గోదావరిలో నీళ్లు ఉన్నందున మిము సహకరిస్తమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వనికి చెప్పానని వెల్లడించారు. 20 ఏళ్ల నుండి రాష్ట్రంలో అనేకమంది కిరికిరి గాళ్లను చూస్తున్నానని మండిపడ్డారు. గతంలో ఏపీ పర్యటనపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా కౌంటర్ ఇచ్చారు. పక్క రాష్ట్రానికి వెళ్లి చేపల పులుసు తిన్నాడనే బండి వ్యాఖ్యలకు బరాబర్ తింటా.. తింటే తప్పా అని కౌంటర్ ఇచ్చారు. రాయలసీమ వెనుకబడిన కరువు ప్రాంతం కాబట్టే నీళ్లు ఇవ్వాలని కోరాం అని కేసీఆర్ అన్నారు. మేం ఇప్పుడు కూడా ఇదే చెబుతున్నాం… తెలుగు రాష్ట్రాల్లో కరువు ప్రాంతాలకు నీరు ఇవ్వాలని మేం గతంలో చెప్పాం..ఇప్పుడు కూడా చెబుతున్నాం అని స్పష్టం చేశారు.