ఈటెల కు భారీ షాక్ ఇచ్చిన మెదక్ జిల్లా కలెక్టర్

we-will-form-a-government-in-telangana-in-the-upcoming-general-elections-says-etela

హుజురాబాద్ ఉప ఎన్నిక లో భారీ విజయం సాధించిన ఈటెల రాజేందర్ కు భారీ ఇచ్చారు మెదక్ జిల్లా కలెక్టర్. మెద‌క్ జిల్లా హ‌కీంపేట‌లో స‌ర్వే చేయ‌నున్న‌ట్టు నోటీసులు ఇచ్చారు. హ‌కీంపేట‌లోని స‌ర్వే నం-97లో స‌ర్వే చేయ‌నున్న‌ట్టు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 18న స‌ర్వేకు హాజ‌రు కావాల‌ని తూప్రాన్ ఆర్డీవో నోటీసులు జారీ చేశారు. ఈట‌ల స‌తీమ‌ణి జ‌మున‌, కుమారుడు నితిన్ రెడ్డి పేరుతో జ‌మునా హ్యాచ‌రీస్ వ‌ద్ద అధికారులు నోటీసులు అంటించారు.

అయితే అంతకుముందు, హుజూరాబాద్‌ ఉపఎన్నికలో గెలిచిన ఆనందంలో ఎన్నికల నిబంధనలు, కరోనా రూల్స్ ఉల్లంఘించి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారంటూ ఈటల రాజేందర్‌తో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో విచారణపై ఎటువంటి నిర్ణయం తీసుకోని సర్కార్.. తాజాగా మరోసారి విచారణకు ఆదేశించడం కలకలం రేపుతోంది.