విశాఖ ఘటనపై కెసిఆర్‌,కెటిఆర్‌ దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

TS CM KCR
kcr-and-ktr-on-vizag-gas-leak

హైదరాబాద్‌: విశాఖలోని ఎల్‌జీ పాలీమర్స్‌ పరిశ్రమలో గ్యాస్‌ లీకైన సంఘటనపై తెలంగాణ సిఎం కెసిఆర్‌, మంత్రి కెటిఆర్‌ స్పందించారు. ఈ ఘటన గురించి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురైనట్లు కెసిఆర్‌ అన్నారు. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన దురదృష్టకరం,ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని సిఎం కెసిఆర్‌ చెప్పారు. కాగా మంత్రి కెటిఆర్‌ విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన గురించి తెలుసుకుని విస్మయానికి గురయ్యానని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చాలా భయంకర ఘటనలు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/