బాహుబలిని వదలని జక్కన్న.. ఆర్ఆర్ఆర్‌లో వర్కవుట్ అయ్యేనా?

Ramcharan and Alia Bhatt Pairing in RRR

టాలీవుడ్ బిగ్గె్స్ట్ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా ఈ సినిమాను దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో సైతం అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఈ క్రమంలో హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఐరిష్ బ్యూటీ ఒలివియా మారిస్‌లను జక్కన్న ఇప్పటికే ఓకే చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఆలియా భట్ చేయబోయే పాత్ర బాహుబలి చిత్రంలోని తమన్నా పాత్రను పోలి ఉంటుందనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సీత అనే పాత్రలో ఆలియా భట్ చరణ్‌కు జోడీగా నటించనుంది. బాహుబలిలో తమన్నాను గ్లామరస్‌గా చూపెట్టిన విధంగానే, ఆర్ఆర్ఆర్‌లో ఆలియాను మనకు అందంగా చూపెట్టనున్నారట.

అంతేగాక ఈ సినిమాలో చరణ్‌తో కలిసి ఓ డ్యుయెట్ సాంగ్‌లో కూడా ఆలియా కనిపించనుందని తెలుస్తోంది. మొత్తానికి జక్కన్న తన బాహుబలి చిత్రానికి సంబంధించి ఏదో ఒక అంశాన్ని ఆర్ఆర్ఆర్ చిత్రంలో మరోసారి రిపీట్ చేయనున్నాడనే వార్తకు ఇది మరింత బలాన్ని చేకూరుస్తోంది. మరి నిజంగానే ఆలియా భట్ పాత్రను తమన్నాలా గ్లామరస్‌గా చూపెడితే, ఆ పాత్రకు ఆమె ఎంతవరకు న్యాయం చేస్తుందో చూడాలి.