ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

కరోనా నియంత్రణ చర్యలపై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై అసహనం

High Court serious over AP government
High Court serious over AP government

Amaravati: రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వెలిబుచ్చింది. గత ఏడాది సెప్టెంబరులో తోట సురేష్ బాబు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రభుత్వాన్ని నిలదీసింది. కరోనా కేసులు, టెస్టులు , పడకలు, మందుల వివరాలు ఇవ్వాలని అడిగినా అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. వైద్యశాలల్లో బెడ్స్, ఆక్సిజన్, మెడిసిన్ ఉన్నాయా అంటూ హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించిన ప్రైవేటు ఆస్పత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, రెమిడెసివర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్‌లోకి వెళ్లడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాస్ హైకోర్టుకు వివరించారు. ఈ నెల 27 లోగా అఫిడవిట్ దాఖలు చేయకుంటే , ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుందని , రాష్ట్రంలో కరోనా చికిత్స వివరాలు కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/