ఢిల్లీ లిక్కర్ స్కామ్..కవిత రేపో, మాపో అరెస్ట్ కావడం ఖాయం: కోమటిరెడ్డి

కెసిఆర్ వ్యతిరేకత మునుగోడు ఎన్నికల్లో బయటపడిందని వ్యాఖ్య

kavitha-will-be-arrested-soon-says-komatireddy

హైదరాబాద్‌ః ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రేపో, మాపో అరెస్ట్ కావడం ఖాయమని బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో మునుగోడు ఉపఎన్నికలో బయటపడిందని చెప్పారు. ప్రజా వ్యతిరేకత నుంచి అందరి దృష్టిని మళ్లించేందుకే టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చారని విమర్శించారు. ఉప ఎన్నిక సమయంలో బిజెపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందంటూ కెసిఆర్ తప్పుడు ప్రచారం చేశారని… అయినా ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని అన్నారు.

తనను రాజకీయంగా ఎదుర్కోలేక తాను అమ్ముడుపోయానంటూ కెసిఆర్, రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. వేంకటేశ్వస్వామి సాక్షిగా చెపుతున్నా తాను ఎవరికీ అమ్ముడుపోలేదని అన్నారు. తనను కొనే శక్తి పుట్టలేదు, పుట్టబోదు అని చెప్పారు. తాను అవినీతి చేసి ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. బిఆర్ఎస్ పాలన పోయి బిజెపి పాలన వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అన్నారు. బిఆర్ఎస్ కు బొందపెట్టేంత వరకు నిద్రపోనని చెప్పారు.