నలుగురు ఎర్రచందనం స్మగ్లర్ల సజీవ దహనం

ఓవర్ టేక్ చేస్తుండగా టిప్పర్‌ను ఢీకొట్టిన వైనం

Fire at Pharma Company
Fire accident

కడప: కడప శివారులో తెల్లవారుజామున 3 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ఎర్ర చందనం స్మగ్లర్లు సజీవ దహనమయ్యారు. కడప శివారులోని గోటూరు వద్ద ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ముందు వెళ్తున్న కారును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ఓ సుమో వాహనం వేగంగా వెళ్లి టిప్పర్‌ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగి రెండు కార్లు, టిప్పర్ దగ్ధమయ్యాయి. మరికొందరికి గాయాలైనట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/