రెండు సెలెక్ట్‌ కమిటీల ఏర్పాటు

ఏపి శాసనమండలి చైర్మన్‌ షరీఫ్‌

Shariff Mohammed Ahmed
Shariff Mohammed Ahmed

అమరావతి: ఏపి శాసనమండలి రెండు సెలెక్ట్‌ కమిటీలను నియమించింది. సిఆర్‌డిఏ రద్దు బిల్లు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించి మండలి చైర్మన్‌ షరీఫ్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కాగా సిఆర్‌డిఏ రద్దు బిల్లు కమిటీకి చైర్మన్‌గా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యవహరించనున్నారు. మరో కమిటీ పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు మంత్రి బుగ్గన రాంజేంద్రనాథ్‌ రెడ్డి సభ్యులుగా ఉంటారు. సిఆర్‌డిఏ రద్దు బిల్లుకు సభ్యులుగా టిడిప నుంచి దీపక్‌ రెడ్డి, బచ్చుల అర్జునుడు, రవిచంద్ర, శ్రీనివాసులు ఉండగా, వైఎస్‌ఆర్‌సిపి నుంచి మహ్మద్‌ ఇక్బాల్‌, బిజెపి నుంచి సోము వీర్రాజు, పిడిఎఫ్‌ నుంచి వెంకటేశ్వరరావు ఉన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు కమిటీకి సభ్యులుగా టిడిపి నుంచి నారా లోకేశ్‌, తిప్పేస్వామి, అశోక్‌ బాబు, సంధ్యారాణి, బిజెపి నుంచి మాధవ్‌, వేణుగోపాల్‌ రెడ్డి, పిడిఎఫ్‌ నుంచి లక్ష్మణ రావు ఉన్నారు. అయితే ఈ సెలెక్ట్‌ కమిటీలను నిన్నటికే ఏర్పాటు చేయాల్సిఉంది. కాగా దీనిపై ఇప్పటికే పలువురు నుంచి లేఖలు అందడంతో మండలి చైర్మన్‌ షరీఫ్‌ రెండు సెలెక్ట్‌ కమిటీలను ఏర్పాటు చేసి, వాటికి చైర్మన్‌లను నియమించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/