బాక్స్ ఆఫీస్ వద్ద కార్తికేయ 2 కలెక్షన్ల దూకుడు తగ్గట్లే..

బాక్స్ ఆఫీస్ వద్ద కార్తికేయ 2 10 రోజులు దాటినా కలెక్షన్ల దూకుడు మాత్రం తగ్గట్లే. నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 మూవీ ఆగస్టు 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. 2014లో వచ్చిన కార్తికేయ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో నిఖిల్ , కలర్ స్వాతి జంటగా నటించారు.

మిస్టరీ థ్రిల్లర్ గా తెరపైకి వచ్చిన ఈ సినిమా కథకు సీక్వెల్ గా కార్తికేయ 2 తెరకెక్కింది. ద్వారక బ్యాక్ డ్రాప్ లో ఒక సరికొత్త మిస్టరీని చాలా ఇంట్రెస్టింగ్ గా దర్శకుడు ఈ సినిమాను తెరపైకి పైకి తీసుకువచ్చాడు. మొదటి రోజు మొదటి షో తోనే పాజిటివ్ టాక్ రావడం , సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియా లో సినిమా ఫై పాజిటివ్ గా స్పందిస్తుండడం తో థియేటర్స్ కు ప్రేక్షకులు పరుగులు పెడుతున్నారు. దీంతో కలెక్షన్ల సునామి నడుస్తుంది.

11 రోజుల్లో కార్తికేయ 2 కలెక్షన్లు చూస్తే..

నైజాంలో రూ. 9.59 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.95 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.51 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.03 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.32 కోట్లు, గుంటూరులో రూ. 2.16 కోట్లు, కృష్ణాలో రూ. 1.79 కోట్లు, నెల్లూరులో రూ. 80 లక్షలతో.. రూ. 25.15 కోట్లు షేర్, రూ. 41.60 కోట్లు గ్రాస్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల్లో రూ. 25.15 కోట్ల షేర్ కలెక్ట్​చేయగా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.60 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 8.70 కోట్లు వసూలు చేసింది. వీటన్నింటితో కలుపుకుంటే 11 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 40.55 కోట్లు షేర్‌, రూ. 78.60 కోట్లు గ్రాస్ వసూలైంది.