తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

తిరుమలః టిటిడి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను బుధవారం ఉదయం విడుదల చేసింది. అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా అందుబాటులోకి వచ్చాయి. అక్టోబర్ నెలకు సంబంధించి మరికొన్ని ఆర్జిత సేవా టికెట్లను ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు లక్కీ డిప్ ద్వారా కేటాయించనున్నారు. వీటితోపాటు అక్టోబర్ నెల కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్ర దీపాలంకరణ తదితర వర్చువల్ సేవల దర్శన కోటా టికెట్లను.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఆర్జిత సేవ కోసం మొత్తం 54 వేల టిక్కెట్లు అందుబాటులో ఉంచారు. భక్తులు ఆన్లైన్లో శ్రీవారి ఆర్జిత సేవలను బుక్ చేసుకోవాలని టిటిడి సూచించింది. అధికారిక వెబ్సైట్ https://ttdsevaonline.com లో సందర్శించి బుక్ చేసుకోవచ్చునని టిటిడి తెలిపింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/