కరోనాపై పోరుకు లక్ష్మీనివాస్‌ మిట్టల్‌ విరాళం

పిఎం కేర్స్‌ కు 100 కోట్లు విరాళం

lakshminivas mittal
lakshminivas mittal

ముంబయి: కరోనా కట్టడికి దేశంలోని విరాళాలు ఇస్తున్నారు. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త, లక్ష్మీనివాస్‌ మిట్టల్‌ 100 కోట్ల విరాళాన్ని ప్రకటించారు.ఈ మొత్తాన్ని పిఎం కేర్స్‌ కు ఇస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థలైన ఆర్సెలార్‌ మిత్తల్‌ నిప్పన్‌ స్టీల్‌, హెచ్‌ఎంఈఎల్‌ సంస్థల తరపున ఈ మొత్తం అందజేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే తమ సంస్థ రోజూ 35 వేల మందికి ఆహరం అందజేస్తోందని అన్నారు. ప్రస్తుతం భారత ప్రజలు కోవిడ్‌19 ను జయించేందుకు ఎనలేని తెగువతో పోరాడుతున్నారని, ఇటువంటి సమయంలో దేశ ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/